నమస్తే శేరిలింగంపల్లి: ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ మహాసభను మే 22 వ తేదీన నిర్వహించనున్నట్లు ఎంసీపీఐయూ గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం తాండ్ర రాంచంద్రయ్య తెలిపారు. స్మారక భవన్ లో నిర్వహించనున్న మహసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. మహాసభ కరపత్రాన్ని విడుదల చేసిన తుకారాం నాయక్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలను నివారించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని అన్నారు. ఈ మహాసభలో ప్రజా సమస్యలపై తగిన పోరాట కార్యక్రమం రూపొందించటం జరుగుతుందన్నారు. ఈ కరపత్రం ఆవిష్కరణలో డివిజన్ కార్యదర్శి కన్న శ్రీనివాస్, డివిజన్ కమిటీ సభ్యులు మధు, సుల్తానా, దశరత్ నాయక్, దానయ్య, తదితరులు పాల్గొన్నారు.