గోపన్ పల్లిలో మొవ్వ సత్యనారాయణపై దాడి… సొంత పార్టీ కార్పొరేటర్, అతని అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు…

నమస్తే శేరిలింగంపల్లి: నియోజకవర్గంలోని చెరువుల సందర్శనలో భాగంగ శేరిలింగంపల్లి బిజెపి నాయకులు శనివారం ఉదయం గోపన్ పల్లి లోని చెరువులను సందర్శించారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, ప్రభాకర్ యాదవ్, నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్ధన్ గౌడ్ లతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గోపన్ పల్లి లోని రంగనాథ స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న దేవుని(చిన్న) చెరువును పరిశీలించారు. ఈ క్రమంలో మువ్వా సత్యనారాయణ వ్యక్తిగత కార్యదర్శి మధుతో పాటు ఆయన డ్రైవర్ ఫోటోలు తీస్తుండగా కొందరు స్థానికులు వారిపై దాడికి దిగారు. మా చెరువు వద్ద మీకేమి పనంటూ వారిని చితకబాదారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మొవ్వా సత్యనారాయణపై సైతం దాడిచేశారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మొవ్వ సత్యనారాయణపై దాడి చేస్తున్న దృశ్యం

తనపై దాడి చేసింది స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అనుచరులుగా పేర్కొంటూ మొవ్వా సత్యనారాయణ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారిని, అందుకు ప్రోత్సహించిన గంగాధర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటు ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లి తీసుకువెళ్లినట్టు సమాచారం. కాగా గచ్చిబౌలి డివిజన్ లోని చెరువుల సందర్శనకు వచ్చిన బిజెపి నాయకులు సొంత పార్టీకి చెందిన స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన అనుచరులు మండిపడుతున్నారు.

మొవ్వ వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here