కూలి ప‌నికి వెళ్లిన యువ‌కుడు అదృశ్యం

మాదాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కూలి పని కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన సంఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌ రాష్ట్రం ఖగారియా జిల్లా సభల్‌పూర్‌ గ్రామానికి చెందిన హకృ పాశ్వాన్‌ బతుకు దెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి మాదాపూర్‌ లోని గఫూర్‌ నగర్‌ జీహెచ్‌ఎంసీ పార్క్‌ ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనంలో కుమారుడు తీతారా కుమార్‌ (21)తో కలిసి నివసిస్తూ స్థానికంగా కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

తీతారా కుమార్ (ఫైల్‌)

కాగా తీతారా కుమార్‌ ఈ నెల 15వ తేదీన మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ బావర్చి హోటల్‌ ఎదురుగా ఉన్న పెట్రోల్‌ పంప్‌ వెనుకాల నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనంలో కూలి పని నిమిత్తం వెళ్లాడు. అయితే అప్పటి నుంచి అతను ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అతని కోసం చుట్టు పక్కల, తెలిసిన వారి వద్ద విచారించినా అతని ఆచూకీ తెలియలేదు. ఈ క్రమంలో అతని కుటుంబ సభ్యులు మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తీతారా కుమార్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు తెలుగు రంగు చొక్కా, బ్లూ కలర్‌ షార్ట్‌ ధరించి ఉన్నాడని, అతని ఎత్తు సుమారుగా 5 అడుగుల 1 అంగుళం వరకు ఉంటుందని, నలుపు రంగులో ఉంటాడని, హిందీ, బీహారీ భాషలు మాట్లాడుతాడని, ఆచూకీ తెలిసిన వారు తమను సంప్రదించాలని మాదాపూర్‌ పోలీసులు తెలిపారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here