- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
హైదర్ నగర్/ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): వరదల్లో నష్టపోయిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందిస్తుందని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్, కృష్ణ వేణి కాలనీలలో వరదల వల్ల దెబ్బ తిన్న పేద కుటుంబాలకి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని ఆయన డిప్యూటీ కమీషనర్ ప్రశాంతి, కార్పొరేటర్ జానకి రామరాజుతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. వరద బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామన్నారు. అవసరం అయితే మరింత సహాయాన్నిఅందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు నార్నె శ్రీనివాస రావు, తెరాస నాయకులు పోతుల రాజేందర్, కోనేరు కృష్ణ ప్రసాద్, సైదేశ్వర్ రావు, బోస్ రెడ్డి, శేషయ్య, రాజు సాగర్, గోపి కృష్ణ, రేణుక, విజయ పాల్గొన్నారు.
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలో…
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్ లో వరదల వల్ల దెబ్బ తిన్న పేద కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని డిప్యూటీ కమీషనర్ ప్రశాంతి, కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు జిల్లా గణేష్, తెరాస నాయకులు దొడ్ల రామకృష్ణ గౌడ్, కాశీనాథ్ యాదవ్, రాజేష్ చంద్ర, సంతోష్ రావు, యాగగిరి, వాసు, షాకత్ అలీ మున్నా, గోపి చారీ, బోయ కిషన్, రమేష్, లక్ష్మి కుమారి, సాగర్ పాల్గొన్నారు.