శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీ, ఆల్విన్ కాలనీ ఫేజ్ 1, HP పెట్రోల్ పంపు నుండి పైప్ లైన్ రోడ్డు కల్వర్ట్ వరకు, AS రాజు నగర్ కాలనీలలో రూ. 1 కోటి 49 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణము పనులకు, BT రోడ్ల నిర్మాణం పనులకు, ఓపెన్ జిమ్ నిర్మాణము పనులకు కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగారావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, శేరిలింగంపల్లి నియోజకవర్గం, కాలనీల అభివృద్దే ధ్యేయంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని అన్నారు. సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. కాలనీ వాసులకు ఉపశమనం లభించిందని, మౌలి వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తానని PAC చైర్మన్ గాంధీ అన్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






