గంగారం విలేజ్ లో ఘ‌నంగా బోనాల ఉత్స‌వాలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని గంగారం విలేజ్ లో ఉన్న శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, బాలింగ్ గౌతమ్ గౌడ్ ల‌తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ బోనాల సందర్భంగా ప్రతి ఆల‌యం వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల వసతులు కల్పిస్తూ ప్రశాంత వాతావరణం క‌ల్పించామ‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here