ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌: ఆనంద్ కుమార్

శేరిలింగంపల్లి, ఆగ‌స్టు 4 (న‌మస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి అసెంబ్లీ, హఫీజ్ పేట్ డివిజన్ డివిజన్ పరిధిలో అమ్మ పేరుతో ఒక చెట్టు కార్యక్రమాన్ని హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో గంగారం గ్రామం రోడ్ , సుభాష్ నగర్ లో హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజు ముదిరాజ్ సమక్షంలో పోలింగ్ బూత్ 107, 108, 142ల‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి ఆనంద్ కుమార్ మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని ప్రేమించడం మన సంస్కృతిలో భాగమని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా మలచుకోవాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు దేవానంద్ (దేవాల్ ) యాదవ్ , రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి అజిత్ సేనాపతి , మాజీ కౌన్సిలర్ రమణయ్య , బీజేపీ నాయకుడు సత్యనారాయణ రాజు , డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్ , డివిజన్ బీజేపీ కార్యదర్శి రాజు యాదవ్ , డివిజన్ బీజేపీ కోశాధికారి సుభాష్ , బీజేపీ నాయకులు పి.శ్రీనివాస్ , బాలరాజు , బీజేవైఎం నాయకులు మహేష్ గౌడ్ , బీజేపీ నాయకులు ప్రభాకర్ రెడ్డి , అవధూత్ కులకర్ణి, బూత్ నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here