నమస్తే శేరిలింగంపల్లి: కొండాపూర్ డివిజన్ పరిధిలోని మార్తాండ్ నగర్‌లో పట్టణ ప్రగతి మూడవ విడత కార్యక్రమాన్ని కార్పొరేటర్ హమీద్‌పటేల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్తీలో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా కాలనీలను పరిశుభ్రంగా తీర్చిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. చెత్త తొలగింపుతో పాటు వరద నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. స్థానికంగా సమస్యలను ఏమైనా ఉంటే ప్రజలు తమ దృష్టికి తీసుకు రావాలని, పట్టణ ప్రగతిలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ చౌదరి, రజనికాంత్, కె లక్ష్మి, బన్నీ, షబ్బీర్ అలీ, సలీం పటేల్, కలీం, ముక్తార్, అంజి, ఫెరోజ్, అక్రమ్, సమీ, వసీమ్, మెహబూబ్, కె శ్రీనివాస్, ఏఈ ప్రతాప్, ఎస్సార్పీ రాజయ్య, ఎస్ఎఫ్ఎ నంద గోపాల్ తదితరులు పాల్గొన్నారు.