చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): భారీ వర్షాల కారణంగా నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, కనుక ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి సూచించారు. శుక్రవారం ఆమె డివిజన్ పరిధిలోని విద్యానగర్ కాలనీ ఫేజ్ 1, 2, జవహర్ కాలనీలలో ఫాగింగ్ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లోని నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమలు వృద్ధి చెందవని, తద్వారా అనారోగ్యాల బారిన పడకుండా చూసుకోవచ్చని అన్నారు.