ఘ‌నంగా గౌతమ్ గౌడ్ జ‌న్మ‌దిన వేడుక‌లు

  • హ‌ఫీజ్‌పేట‌లో ఉచిత వైద్య శిబిరం
  • పారిశుధ్య కార్మికుల‌కు రెయిన్ కోట్‌ల పంపిణీ

హ‌ఫీజ్‌పేట‌‌ (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): హ‌ఫీజ్‌పేట డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు గౌతమ్ గౌడ్ జన్మదినం సందర్బంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్‌ లు పంపిణీ చేశారు. అనంత‌రం గౌతం గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

గౌత‌మ్ గౌడ్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గౌతం గౌడ్ త‌న పుట్టినరోజు సందర్బంగా ఉచిత వైద్య శిభిరాన్ని ఏర్పాటు చేయ‌డం, పారిశుధ్య కార్మికులకు రెయిన్ కోట్‌లు పంపిణీ చేయడం చాలా గొప్ప విషయ‌మని అభినందించారు. సామాజిక దృక్పథంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయ‌డం అభినందనీయమని, వైద్య ఆరోగ్య శిబిరాల‌ను ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు. ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

పారిశుధ్య కార్మికుల‌కు రెయిన్ కోట్‌ల‌ను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

ఈ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ తెరాస‌ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్ కుమార్, తెరాస నాయకులు వాలా హరీష్ రావు, లక్ష్మా రెడ్డి, మాధవరం గోపాల్, ఎవీ ప్రసాద్, మిద్దెల మల్లారెడ్డి, కంది జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

వైద్య శిబిరంలో పరీక్ష‌లు చేయించుకుంటున్న ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here