కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలు కోరుకొనే విధంగా బస్తీలను, కాలనీలను అభివృద్ధి పరుస్తున్నామని, ప్రధానంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను తీర్చటం కోసం కృషి చేస్తున్నామని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. శుక్రవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని వడ్డెర బస్తీలో స్థానిక సమస్యలు తెలుసుకోవటానికి స్థానిక నాయకులు, ప్రజలతో కలసి కార్పొరేటర్ హమీద్ పటేల్ పర్యటించారు.
బస్తీలో త్వరితగతిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లైన్ల పునరుద్దరణ పనులు పూర్తి చేసి, వెంటనే సీసీ రోడ్ల పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. బస్తీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని స్థానిక నాయకులు, ప్రజలు కోరటం జరిగిందని అని అన్నారు. ఈ విషయాన్ని ఎమ్యెల్యే గాంధీ దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కారిస్తామని తెలియజేశారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ వెంట దాసర్ల సత్తయ్య, అలాకుంట నరసింహ, గొలుసుల రాము, అలకుంట మల్లేష్, సిద్దులు, ఎల్లయ్య, హనుమంతు, చెన్నయ్య, సాయి, వెంకటేష్, అర్జున్, కృష్ణయ్య, గొలుసుల నరసింహ, వి. వెంకటేష్, ఆంజనేయులు, ఎస్ రాజు, మంగలి బాల కృష్ణ, రేణుక కాలనీ వాసులు ఉన్నారు.