నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు వద్ద రూ. 26.27 కోట్ల అంచనావ్యయం తో 7 ఎంఎల్‌డీ సామర్థ్యం గల ఎస్టీపీ నిర్మాణానికి అవసరమయ్యే స్థలాన్ని మంగళవారం స్థానిక కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో మొత్తం ఏడు ఎస్టీపీలు మంజూరయ్యాయని వాటి నిర్మాణానికి అనువైన స్థలాలను పరిశీలించి త్వరలోనే ఎస్టీపీలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. చెరువులు కలుషితం కాకుండా మురుగు నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి చెరువులను సస్యశ్యామలం, సుందరీకరణ చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృషి చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఎస్టీపీల నిర్మాణం పై అధికారులకు పలు సూచనలు,సలహాలు ఇచ్చారు.వారి వెంట జలమండలి ఎస్టీపీ విభాగం అధికారులు సీజీఎం ప్రసన్న కుమార్, జీఎం వాస సత్యనారాయణ, డీజీఎంలు దీపాలి , రజిని, ఎస్టేట్ ఆఫీసర్ సత్యనారాయణ రావు , మేనేజర్లు శంకర్,వెంకట్, టౌన్ ప్లానింగ్ అధికారి సంపత్, మెగా ప్రాజెక్ట్స్ ఇంజనీర్ నిస్సార్ తదితరులు పాల్గొన్నారు.
