నమస్తే శేరిలింగంపల్లి: అత్యవసర చికిత్స నిమిత్తం ఆసుపత్రి బిల్లుల పరిహారార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొన్న ఐదుగురు బాధితులకు ముఖ్య మంత్రి సహాయ నిధి ద్వారా రూ. 1.98 లక్షలకు సంబంధించిన ఎల్ఓసీల ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ మంగళవారం అందజేశారు. మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబాలకి అందజేసిన అనంతరం ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడారు. ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా అండగా నిలుస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి , నాయకులు ఊట్ల చంద్రారెడ్డి , బ్రిక్ శ్రీను , విద్యాసాగర్, రాము, స్వరూప తదితరులు పాల్గొనారు.