నమస్తే శేరిలింగంపల్లి: సీసీ కెమెరాల ఏర్పాటుతో శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు నేరాలను అదుపుచేసుకోవచ్చని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ బి బ్లాక్ లో కమిటీ హల్ నిర్మాణం, సీసీ కెమెరాలు ఏర్పాటును కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో చాలా ఉపయోగం అన్నారు. ఒక్కో సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రాంనగర్ బి బ్లాక్ కాలనీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు, జనరల్ సెక్రెటరీ క్రాంతి కుమార్,కె.వేంకటేశ్వర రావు, నాగరాజు, గోపాల్ యాదవ్, రవి, రంజిత్, పార్టీ కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.