కొండాపూర్ డివిజన్ లో వరద నీటి కాలువ విస్తరణ పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: ప్రజల అవసరాల దృష్ట్యా చేపట్టిన వరద నీటి కాలువ విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో కోటి యాబై ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో, మాదాపూర్ విలేజ్ వద్ద గల త్రిశూల్ గ్రాండ్ హోటల్ వద్ద రూ.38 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాల్వ‌ విస్తరణ నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ హమీద్ పటేల్, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద నీటి కాల్వ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడ రాజీ పడేది లేదని చెప్పారు. పనులలో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని అధికారులకు సూచించారు.

కొండాపూర్ డివిజన్ మాదాపూర్ త్రిశూల్ గ్రాండ్ హోటల్ వద్ద జరుగుతున్న వరద నీటి కాలువ పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ

వరద నీటి కాల్వ నిర్మాణ పనులపై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని లోతట్టు ప్రాంతాలు, నీరు నిల్వ ప్రాంతాలను గుర్తించి ప్రజలకు ఇబ్బంది కల్గకుండా సన్నద్ధం కావాలని, ప్రత్యేక శ్రద్ధ పెట్టి ముంపునకు గురికాకుండా ముందస్తు చర్యలు తీసుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. అనంతరం మార్తాండ్ నగర్ లో మ్యాన్ హోల్ పూడిక తీత పనులను పరిశీలించారు. డ్రైనేజి నీరు ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని ప్రతి మ్యాన్ హోల్ వద్ద పూడిక తీత తీయాలని, మ్యాన్ హోల్ లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తీసి వేసి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాలని ప్రభుత్వ విప్ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, డీఈ రమేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ వెంకటేష్, కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణా గౌడ్, టీఆర్ఎస్ నాయకులు తిరుపతి, రమేష్, రూప రెడ్డి, శ్రావణ్ యాదవ్, తిరుపతి, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ బి బ్లాక్ లో వరద నీటి కాలువ నిర్మాణం పనులను పరిశీలిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
మార్తాండ నగర్ లో మ్యాన్ హోల్ పూడికతీత పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here