ఢిల్లీకి త‌ర‌లిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ శ్రేణులు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 1 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తి సంరక్షణ లక్ష్యంగా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చలో ఢిల్లీ – ఓటు బచావో, దేశ్ బచావో ఉద్యమంలో పాల్గొనేందుకు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు న్యూఢిల్లీకి త‌ర‌లి వెళ్లారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ నాయకత్వంలో, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కట్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి తరలివెళ్లాయి.

న్యూఢిల్లీ చేరుకున్న నాయకులు, కార్యకర్తలు తొలుత తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన‌ భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతున్న ఈ ఉద్యమం ద్వారా ఓటు హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువల సంరక్షణ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here