నమస్తే శేరిలింగంపల్లి: టీఅర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేదలపై నిరంకుశంగా వ్యవహరిస్తుందని, రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని టీపీసీసీ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ డా. మల్లు రవి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని బసవతారక నగర్ బాధితులను కాంగ్రెస్ నాయకులతో కలిసి పరామర్శించారు. పేదల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి పట్ల మల్లు రవి మండిపడ్డారు. పేదలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా గుడిసెలను కూల్చివేయడం దారుణమని అన్నారు. బాధితులకు అన్ని సౌకర్యాలతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జెరిపాటి జైపాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్లను బాధితులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జెరిపాటి జైపాల్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాల నుండి గుడిసెలు వేసుకొని పేద ప్రజలు జీవిస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వారి ఇళ్లను పడగొట్టడం హేయమైన చర్య అని ఖండించారు. బాధితులకు ఏ ఇబ్బంది కలిగిన కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని జైపాల్ దైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ రఘునందన్ రెడ్డి, మైపాల్ యాదవ్, భారత్ గౌడ్, ఇలియాస్ షరీఫ్, శ్రీనివాస్, సురేష్ నాయక్, ఈశ్వర, రేవెల్ల రాజేష్, జావీద్ హుస్సేన్, జహంగీర్, ఖాజా అజీమ్ ఉద్దీన్, పోచయ్య, రాజేందర్, ఆయాజ్ ఖాన్, యువజన కాంగ్రెస్ నాయకులు సౌందర్య రాజన్, దుర్గేష్ , ముష్రాఫ్, అసద్, కరీం, సైదులు, సలీం, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.