శేరిలింగంపల్లిలో SIR సర్వేకు ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు

శేరిలింగంపల్లి, జూలై 18 (న‌మస్తే శేరిలింగంపల్లి): భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR)-2026 కార్యక్రమాన్ని శేరిలింగంపల్లి డివిజన్‌లో సజావుగా నిర్వహించేందుకు మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. హుడా ట్రేడ్ సెంటర్, తారానగర్, లింగంపల్లి విలేజ్ ప్రాంతాల్లో స్థానిక నాయకులతో కలిసి SIR సర్వేను ఆయన పరిశీలించారు. BLOలు చేపడుతున్న ఇంటింటి ధ్రువీకరణ ప్రక్రియకు ప్రజలకు సులభంగా సేవలు అందేలా డివిజన్‌లోని ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయించారు. అలాగే BLOలకు సహకరించేలా బూత్ లెవెల్ ఏజెంట్లను (BLAలు) నియమించి సర్వే వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. డివిజన్‌లో ఒక్క అర్హుడైన ఓటరు కూడా ఓటరు జాబితాలో నమోదు కాకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో హెల్ప్ డెస్క్‌లు, BLAలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఓటరు వివరాలను ధ్రువీకరించుకోవాలని కోరారు. కొత్త ఓటరు నమోదు, చిరునామా మార్పు, వివరాల సవరణల కోసం ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, తుది ఓటరు జాబితాను అక్టోబర్ 12న ప్రచురిస్తారని వెల్లడించారు. హెల్ప్ డెస్క్‌ల ద్వారా ఫారం-6, ఫారం-7, ఫారం-8 నింపడంలో కూడా సహాయం అందిస్తామని చెప్పారు. అలాగే అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారితో ఫోన్‌లో మాట్లాడి SIR సర్వేలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, సూపర్వైజర్ దీపక్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, మహేష్ గౌడ్, లింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షుడు గడ్డం రవి యాదవ్, వార్డు సభ్యురాలు కవిత గోపీకృష్ణ, పొట్ట మల్లికార్జున్ యాదవ్, జనరల్ సెక్రటరీ దేవులపల్లి శ్రీనివాస్, నటరాజ్, సయ్యద్ మీర్ అలీ, అహ్మద్, అజయ్, రోహిత్, భరత్, రేవంత్, నర్సింగ్, ఉదయ్, అబ్దుల్, గోపి, BLOలు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here