శేరిలింగంపల్లి, జూలై 18 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ వి. జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడ డివిజన్ పరిధిలోని మదీనాగూడ గ్రామం, సాయి కృప అపార్ట్మెంట్, నైమిష అపార్ట్మెంట్లలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమాన్ని నియోజకవర్గ నాయకులు, స్థానిక ప్రజలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ పేరు ఓటరు జాబితాలో సక్రమంగా నమోదు అయి ఉందో లేదో తప్పనిసరిగా ధ్రువీకరించుకోవాలని సూచించారు. పేరు లేకపోతే కొత్తగా నమోదు చేసుకోవాలని, వివరాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే సవరించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతి ఓటు కీలకమని, అందరూ ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షుడు నల్ల సంజీవ రెడ్డి, నాయకులు బాలింగ్ యాదగిరి గౌడ్, వీరేందర్ గౌడ్, ఆంజనేయులు యాదవ్, రాంబాబు, సాయి యాదవ్, నాగేశ్వర్ రావు, బాలకృష్ణ, కట్ల శేఖర్ రెడ్డి, యలమంచి ఉదయ్ కిరణ్, రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి శ్రీహరి గౌడ్, విష్ణు, యాదగిరి, నవీన్ యాదవ్, మనోజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





