శేరిలింగంపల్లి, జూలై 18 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన కార్యాచరణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి కమిషనర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్‌తోపాటు డివిజన్ అసిస్టెంట్ ఇంజనీర్లు (AEs), బూత్ లెవల్ అధికారులు (BLOs), సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో SIR కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లి, ప్రతి అర్హ ఓటరుకి చేరేలా అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఎల్‌ఓలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. అధికారులు సూచించిన మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో చర్యలు వేగవంతం చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.





