చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని నెహ్రూ నగర్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కోరుతూ నియోజకవర్గం శివసేన నాయకులు సోమవారం పోలీసులకు రూ.30వేల విరాళం అందజేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి శివసేన అధ్యక్షుడు బెజగం కేశవ్, నాయకుడు వేణులు చందానగర్ సీఐ క్యాస్ట్రో రెడ్డికి విరాళం చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా క్యాస్ట్రో రెడ్డి మాట్లాడుతూ పోలీసులకు ప్రజల సహకారం తోడవుతే శాంతి భద్రతల పరిరక్షణలో మరింత ముందడుగు వెయ్యచ్చు అన్నారు. ఈ క్రమంలోనే శివసేన నాయకుల సహకారం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం శివసేన ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, నాయకులు అనిల్ గౌడ్, జగన్, సాయి గౌడ్, హరి గౌడ్, చరణ్ పాల్గొన్నారు.






