ఎస్సీ కార్పొరేష‌న్ ద్వారా అర్హుల‌కు రూ.5 ల‌క్ష‌లు అంద‌జేత

శేరిలింగంప‌ల్లి‌‌‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ల‌బ్ధిదారుల‌కు మంజూరైన రూ.5 ల‌క్ష‌ల‌కు సంబంధించిన లోన్ పత్రాలను అర్హులైన 10 మంది కుటుంబాలకు శేరిలింగంపల్లి తహసీల్దార్ వంశీమోహన్, ప్రాజెక్టు ఆఫీసర్ వ‌త్సల దేవిల‌తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సోమ‌వారం అంద‌జేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకుని ఈ ప‌థ‌కం కింద రుణ స‌దుపాయం పొంద‌వ‌చ్చ‌ని సూచించారు. ప్ర‌భుత్వం పేద‌ల కోసం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. రుణ స‌దుపాయం పొంద‌డం వ‌ల్ల స్వ‌యం ఉపాధి మార్గాలు వెదుక్కోవ‌చ్చ‌ని, ఆర్థిక స్వావ‌లంబ‌న పొంద‌వ‌చ్చ‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

అర్హుల‌కు రుణ ప‌త్రాల‌ను అంద‌జేస్తున్న ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here