నమస్తే శేరిలింగంపల్లి: ఆల్ ఇండియా సారీ మేళా, నవరాత్రి ఫెస్టివల్, గుజరాత్ హ్యాండీక్రాప్ట్స్ మేళా సందర్బంగా మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళా ఉత్పత్తులు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మంగళగిరి, పోచంపల్లి, గద్వాల్, కోట, భాగల్పూరి, మహేశ్వరి, మదనపల్లి పట్టు, బెంగళూరు సిల్క్, చెందేరి, కలంకారీ, బందీని, పటోళ్ల తదితర చీరలు, అద్దాల లంగాలు, బ్లౌస్ లు, హ్యాండ్ బ్యాగ్స్, గాజులు, జ్యువలరీ, హోమ్ డెకార్స్ మొదలైన హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్పత్తులు ఆకట్టుకుంటున్నాయి. బెంగళూరు నుంచి వచ్చిన కళాకారులు విద్వాన్ టీ ఎస్ సాగర్ శిష్య బృందం భరతనాట్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. మైసూర్ జాతి, భో శంభో, పాహిమాం శ్రీ రాజా రాజేశ్వరి, త్రిమాత కౌత్వం, శివ తాండవం, దుర్గ స్తుతి. మొదలైన అంశాలను ప్రదర్శించారు.