నమస్తే శేరిలింగంపల్లి: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎంసీపీఐయూ పార్టీ పోటీ చేస్తుందని, బహుజన లెప్ట్ ఫ్రంట్ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంసీపీఐయూ రాష్ట్ర కమిటీ సభ్యులు కర్ర రాజిరెడ్డిని బరిలో నిలుపుతున్నట్లు జాతీయ కార్యదర్శి మద్దికాయల అశోక్ వెల్లడించారు. బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్ లో పెద్దారపు రమేష్ అధ్యక్షతన జరిగిన ఎంసీపీఐ యూ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కర్ర రాజిరెడ్డికి సీపీఐ, సీపీఎం, సామాజిక ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతునిచ్చి గెలిపించుకోవాలని మద్దికాయల అశోక్ పేర్కొన్నారు.
ఈ నెల 17 నుంచి ఓంకార్ వర్థంతి పక్షోత్సవాలు
ఎంసీపీఐయూ వ్యవస్థాపకులు మద్దికాయల ఓంకార్ 13వ వర్థంతి సందర్భంగా ప్రస్తుత రాజకీయాలు, వామపక్ష- సామాజిక సంఘాల కర్తవ్యం అనే అంశంతో ఈ నెల 17 నుంచి 31 వ తేదీ వరకు వర్థంతి పక్షోత్సవాలను నిర్వహించనున్నట్లు ఎంసీపీఐ యూ రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ తెలిపారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పెద్దారపు రమేష్, వి. తుకారాం నాయక్, కన్నం వెంకన్న, గోనె కుమారస్వామి, హంసారెడ్టి లను ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్ తెలిపారు. రాష్ట్ర కమిటీకి ఎం. రమేష్, రాజేష్, పురుషోత్తం, గోపీ లను ఎన్నుకున్నట్లు చెప్పారు . ఈ సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి గాదగోని రవి, వి. ఉపేందర్ రెడ్డి, మట్టయ్య, సుధాకర్, సుకన్య, రాగసుధ, జబ్బర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.