కొత్తపేట సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ : ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి:ఇల్లందు నియోజకవర్గం గంధపల్లి కొత్తపేట సెంటర్ లో విశ్వ విఖ్యాత, నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహావిష్కరణలో ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శాసన సభ్యురాలు బానోతు హరిప్రియ నాయక్, ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీతో కలిసి ఆవిష్కరించారు.అనంతరం చేతన ఫౌండేషన్ సహకారంతో స్కూల్ బెంచీలు, ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్, వీధి వ్యాపారుల కోసం తోపుడు బండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాది కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, మహబూబాద్ జడ్పీ ఛైర్మన్ అంగోతు బిందు, మియపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , టీఆర్ఎస్ సీనియర్ నాయకులు తాత మధు, కమ్మ మహాజన సంఘం ఖమ్మం అధ్యక్షులు వేజల్ల సురేష్, సెక్రటరీ చావ నారాయణరావు, రాష్ట్ర కమ్మ సంఘం సెక్రటరీ గంగవరపు ప్రసాద్, కోశాధికారి కండేప నేని రత్నాకర్ రావు, ఉపాధ్యక్షులు బొడ్డు రవిశంకర్, పాతురి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here