వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో సంక్రాంతి సంబురాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డివిజన్ బీజేపీ నాయకుడు ఉప్పల ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఆయన నివాసంలో పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆయన తన సోదరులు శ్రీకాంత్ గౌడ్, మహేష్ గౌడ్, సంతోష్, దినేష్, పుష్పేందర్, భాస్కర్‌లతో కలిసి గాలిపటాలను ఎగురవేసి పండుగను జరుపుకున్నారు.