చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పుష్పగిరి శారదా లక్ష్మీ నృసింహ పీఠాధిపతి నృసింహ భారతి స్వామి దీప్తిశ్రీనగర్‌లోని బీజేపీ రాష్ట్ర నాయకుడు, కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగం రాజశేఖర్ గృహానికి సంక్రాంతి సందర్భంగా విచ్చేశారు. ఈ సందర్బంగా రాజశేఖర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు నృసింహ భారతి స్వామి ఆశీర్వాదం పొందారు. అనంతరం ఆయన సనాతన ధర్మం గురించి వివరించారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని కోరారు.