మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలో పెండింగులో ఉన్న పైప్ లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ గురువారం మాదాపూర్ జలమండలి డీజీఎం శ్రీమన్నారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. ఆదిత్య నగర్లో యూజీడీ పనులను వేగంగా పూర్తి చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య నగర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎండీ ఖాసీం, వార్డ్ సభ్యుడు రహీం, నాయకులు మునఫ్ ఖాన్, షోయబ్ పాల్గొన్నారు.