హ‌ఫీజ్‌పేట డివిజ‌న్‌లో కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్ ప‌ర్య‌ట‌న

హ‌ఫీజ్‌పేట‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని రామకృష్ణ నగర్ లో సాయికృపా అపార్ట్‌మెంట్ వ‌ద్ద‌ నూతనంగా చేపట్టాల్సిన పార్క్ అభివృద్ధి పనులు, కల్కి అపార్ట్‌మెంట్ వ‌ద్ద‌ ప్రజలు ఎదుర్కొంటున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యను హ‌ఫీజ్‌పేట‌, మాదాపూర్ డివిజ‌న్ల కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌లు సోమ‌వారం ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్య క‌లిగినా త‌మ దృష్టికి తీసుకువ‌స్తే ప‌రిష్క‌రిస్తామ‌న్నారు. డివిజ‌న్ల అభివృద్ధే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు మెరుగైన మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పిస్తామ‌న్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ పేట్ డివిజన్ టీఆర్ఎస్ గౌరవ అధ్యక్షుడు వాలా హరీష్ రావు, నాయకులు విష్ణు, సురేష్, వెంకట్రామిరెడ్డి, రామ్మోహన్, ఆనంద్ రావు, రసూల్ పాల్గొన్నారు.

రామ‌కృష్ణ న‌గ‌ర్‌లో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌
స్థానికుల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుంటున్న కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

హుడా కాల‌నీలో…
హ‌ఫీజ్‌పేట డివిజ‌న్ ప‌రిధిలోని హుడా కాల‌నీలో యూజీడీ స‌మ‌స్య‌ను, నూత‌నంగా చేప‌ట్టాల్సిన పైప్‌లైన్ ప‌నుల‌ను కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌లు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ డివిజ‌న్ ప‌రిధిలో పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ప‌నుల‌ను త్వ‌ర‌గా పూర్తి చేసి స‌దుపాయాల‌ను అందుబాటులోకి తెస్తామ‌న్నారు. ఈ కార్య‌క్రమంలో జ‌ల‌మండ‌లి డీజీఎం నాగ ప్రియ‌, మేనేజ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్యం రాజు, ఎం.ఎస్ రాజు, మోసిన్‌, సూరిబాబు, రాము, చంద్రపాల్, నీలకంఠ రావు, వరదేశ్వరి, తిరుమల, సుజాత పాల్గొన్నారు.

హుడా కాల‌నీలో ప‌ర్య‌టిస్తున్న కార్పొరేట‌ర్లు పూజిత‌, జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here