వివేకానందనగర్ (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ బీజేపీ ఇంచార్జ్ ఉప్పల విద్యా కల్పన ఏకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి హాజరై పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. పోటీల్లో విజేతగా నిలిచిన రమ్య అనే మహిళకు రూ.5వేల నగదు బహుమతి లభించింది. దీంతోపాటు ద్వితీయ, తృతీయ, కన్సొలేషన్ ప్రైజ్ లను కూడా అందజేశారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మాజీ అధ్యక్షుడు కాంతారావు, రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు రవి కుమార్ యాదవ్, జ్ఞానేంద్ర ప్రసాద్, బీజేవైఎం రాష్ట్ర నాయకుడు ధర్మారావు, రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు వీణా రెడ్డి, మాదాపూర్ డివిజన్ ఇంచార్జి రాధాకృష్ణ, చందానగర్ డివిజన్ ఇంచార్జి కసిరెడ్డి సింధు రెడ్డి, వెంకట స్వామి రెడ్డి, తిరుపతి రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, సత్యనారాయణ యాదవ్, కనకయ్య, రాములు గౌడ్, కృష్ణ, జంగారెడ్డి, దయాకర్ రెడ్డి, గణేష్ గౌడ్, నామాల శ్రీనివాస్ పాల్గొన్నారు.