నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప కాలనీలో భూగర్భ డ్రైనేజీ పైప్ లైన్ పనులను స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ స్థానికులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూజీడీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. స్థానికులకు ఇబ్బంది లేకుండా త్వరత్వరగా పనులను పూర్తి చేయాలన్నారు.
దశల వారీగా మౌలిక వసతులు కల్పించి అన్ని కాలనీలలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ గృహకల్ప వార్డు మెంబర్ శ్రీకళ, వెంకటేశ్వర్లు, సందయ్య నగర్ కాలనీ అధ్యక్షుడు బస్వరాజ్ లింగాయత్, లక్ష్మణ్ యాదవ్, గోపాల్ యాదవ్, పట్లోల నరసింహా రెడ్డి, కుమార్ గుప్త, జమ్మయ్య, రోజా, తదితరులు పాల్గొన్నారు.