నమస్తే శేరిలింగంపల్లి: నందమూరి తారక రామారావు ఒక నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకుని యావత్ తెలుగు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన మహోన్నతమైన వ్యక్తి అని బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ అన్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి దినోత్సవ సందర్భంగా హైదర్ నగర్ డివిజన్ అల్లాపూర్ సొసైటీ నిజాంపేట్ రోడ్డులో ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు శత జయంతి దినోత్సవ కార్యక్రమంలో రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు రాజకీయాల్లో ప్రత్యేక స్థానం కల్పించి వారి అభ్యున్నతికి కృషి చేశారన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశం నలుమూలల తెలియజేసిన మహనీయుడన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొడాలి రవి, బొల్లేపల్లి సీతారామరాజు, వేణు యాదవ్ పార్థసారధి నాయుడు, కృష్ణ, బాలయ్య, హేమాద్రి ,రవి, నివర్తి, అంజయ్య, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.