నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి కాలనీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఇందిరానగర్ లో ప్రజా సమస్యలపై బస్తీ బాట నిర్వహించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చెప్పారు. మంచి నీటి, సీసీ రోడ్లు తదితర సమస్యలను పరిష్కరిస్తామన్నారు. హెచ్ఎండబ్ల్యుఎస్ అధికారులతో మాట్లాడి కాలనీలో అదనంగా మంచి నీటి పైపు లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కాలనీ వాసులకు స్వచ్ఛమైన మంజీరా నీటిని అందించాలనే లక్ష్యంతో నూతనంగా పైపు లైన్ వేయాలన్నారు. మెయింటెనెన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు. అన్ని ప్రాంతాల్లో మెరుగైన మంచినీటి సౌకర్యం కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పర్చే దిశగా పని చేస్తున్నామన్నారు. గచ్చిబౌలి డివిజన్ లోని ప్రతీ కాలనీ, బస్తీల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతీ మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎండబ్ల్యుఎస్ మేనేజర్ నరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్,గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి,సీనియర్ నాయకులు రంగస్వామి, మురగ, చిన్న నరేందర్, ఇందిరా నగర్ కాలనీ వాసులు సుకుమార్, రాములు, నరసింహ, శివకుమార్, యాదయ్య, రవీందర్, మహీందర్, అనసూయ, భాగ్యమ్మ, స్వరూప, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.