జాతిని అవమానిస్తే సహించం: శేఖర్ సగర

  • రంగారెడ్డి జిల్లా సగర సంఘం అధ్యక్షుడిగా కృష్ణ సగర

మీర్ పేట్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సగర జాతిని తెలంగాణ ప్రభుత్వం అవమానించే విధంగా వ్యవహరిస్తుందని, తీరు మార్చుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య‌మిస్తామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర అన్నారు. బుధవారం మీర్ పేటలో రంగారెడ్డి జిల్లా సగర సంఘం ఎన్నికల సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్ర‌భుత్వం తమ జాతికి అన్యాయం చేస్తూ తమ రాజకీయ లబ్దికోసం మరో జాతికి మేలుచేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మ గౌరవ భవనాల పేరుతో ఇచ్చిన స్థలాన్ని మారుస్తూ తమ జాతిని అవమానించే విధంగా వ్యవహరిస్తుందని అన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కుల వృత్తుల మీద ఆధారపడిన కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటుచేసి బడ్జెట్ ఇస్తే తెలంగాణ ప్రభుత్వం రెండవ సారి అధికారంలోకి వచ్చిన తరువాత నయా పైసా కూడా ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఉన్నత వర్గాలకు పెద్దపీట వేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కోకాపేట స్థల మార్పిడి విషయంలో ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తిరుగుబాటు తప్పదని అన్నారు. సగర ఫెడరేషన్ కు తక్షణమే రూ.వంద కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సగర సంఘం గౌరవాధ్యక్షుడు ముత్యాల హరికిషన్ సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరక్క సత్యం సగర, ఉపాధ్యక్షుడు శెన్చెట్టి విజయేంద్ర సగర, సంయుక్త కార్యదర్శులు దామోదర్ సగర, సూరంపల్లి బాబురావు సగర, కార్యనిర్వాహక కార్యదర్శులు భాస్కర్ సగర, సత్యపాల్ సగర, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ సగర, రాష్ట్ర ప్రచార కార్యదర్శి సతీష్ సగర, సంయుక్త కార్యదర్శి మహేందర్ సగర, మీర్ పేట్ సగర సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాజేందర్ సగర, ధన్ రాజ్ సగర పాల్గొన్నారు.

కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర

రంగారెడ్డి జిల్లా స‌గ‌ర సంఘం నూత‌న క‌మిటీ…
రంగారెడ్డి జిల్లా స‌గ‌ర సంఘం అధ్య‌క్షుడిగా మీర్ పేట‌కు చెందిన సురంప‌ల్లి కృష్ణ స‌గ‌ర ఎన్నిక‌య్యారు. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా బాలు స‌గ‌ర‌, కోశాధికారిగా వావిలాల దామోద‌ర్ స‌గ‌ర‌, ఉపాధ్య‌క్షులుగా ఎన్‌.నారాయ‌ణ స‌గ‌ర‌, యు.వెంక‌ట రాములు స‌గ‌ర‌, జి.దేవేంద‌ర్ స‌గ‌ర‌, బి.ఓం దేవ్ స‌గ‌ర‌, చింత వినోద్ స‌గ‌ర‌, సంయుక్త కార్య‌ద‌ర్శులుగా చింతల న‌వీన్ స‌గ‌ర‌, వేముల రాజు స‌గ‌ర‌, జంగ‌య్య స‌గ‌ర‌, కార్య నిర్వాహ‌క కార్య‌ద‌ర్శులుగా చింత జ‌గ్‌జీవ‌న్ స‌గ‌ర‌, కేశంగారి జ‌య‌స్క‌ర్ స‌గ‌ర‌, కార్య‌వ‌ర్గ స‌భ్యులుగా నంగునూరు నాగ‌రాజు స‌గ‌ర‌, బీజ్‌ప‌ల్లి స‌గ‌ర‌లు ఎన్నిక‌య్యారు.

నూతనంగా ఎన్నికైన రంగారెడ్డి జిల్లా సగర సంఘం అధ్యక్షుడు కృష్ణ సగరకు నియామక పత్రం అందజేస్తున్న రాష్ట్ర నాయకులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here