మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ జి.రంజిత్ రెడ్డిని బుధవారం హఫీజ్‌పేట, మాదాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు పూజిత, జగదీశ్వర్ గౌడ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలలో రెండో సారి ఇరువురూ కార్పొరేటర్లుగా విజయం సాధించిన సందర్భంగా వారు ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్, ఎంపీ రంజిత్ రెడ్డిలను కలిశారు. అనంతరం మంత్రి, ఎంపీలకు కార్పొరేటర్లు పుష్పగుచ్ఛం అందజేసి ధన్యవాదాలు తెలిపారు. తమకు మళ్లీ కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని తెలిపారు. అనంతరం మంత్రి, ఎంపీలు కార్పొరేటర్లకు శుభాకాంక్షలు తెలిపారు.






