కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ తెరాస అభ్యర్థి హమీద్ పటేల్ కు డివిజన్ మున్నూరు కాపుల సంఘం సభ్యులు మద్దతు పలికారు. ఈ మేరకు హమీద్ పటేల్‌ను కలిసిన వారు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు. కొండాపూర్ లో చేసిన అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తెరాస ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతున్నారని హమీద్ పటేల్ అన్నారు.

