మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ లో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కుమారుడు పృథ్వి గాంధీ, డివిజన్ తెరాస అధ్యక్షుడు శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు కాలనీల నాయకులు తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పృథ్వి గాంధీ, శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఎంతో మంది తమ పార్టీలో చేరుతున్నారన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల చొరవతో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. తెరాస ప్రభుత్వంతోనే ప్రజాభివృద్ధి, పట్టణాలు, డివిజన్ల అభివృద్ధి సాధ్యమన్నారు. తెరాస అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీలో చేరిన వారిలో శశిధర్ యాదవ్, రంగనాయకుల స్వామి, కేశవులు, సుధాకర్, వెంకట రాములు, లక్ష్మి చంద్రమ్మ, సుల్తానమ్మ ఉన్నారు.

