శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ ప్రగతి ఎంక్లేవ్ కాలనీలో చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, శేరిలింగంపల్లి కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవికుమార్ యాదవ్ గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ గణనాథుడి ఆశీస్సులు శేరిలింగంపల్లి ప్రజలపై ఎల్లప్పుడూ ఉండేలా ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు.






