శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): బీసీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 7వ తేదీన లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని నీరుషా బాంకెట్ హాల్ లో నిర్వహించ తలపెట్టిన బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక సమావేశాన్ని విజయవంతం చేయాలని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీసీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనాలని కోరారు.






