అన్నమయ్యపురంలో అలరించిన శ్రీహరి హరి నృత్యధామం నృత్యప్రదర్శన

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 6 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అన్నమయ్యపురంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు ఆధ్వర్యంలో శ్రీహరి హరి నృత్యధామం డాన్స్ అకాడమీ బృందం మూషిక వాహన, పుష్పాంజలి, నమఃశివాయతే, శ్రీగణనాథం, మహాగణపతి, బ్రహ్మమొక్కటే తదితర కీర్తనలకు అద్భుతంగా నృత్యాన్ని రూపొందించి అభినయించారు. గురువులు వి. దుర్గ శ్రీకృష్ణ, జ్యోత్న్స బెన్నా సమక్షంలో విద్యార్థులు దుర్గ, నైశ్విత, సిరిజాక్షిత, ఇందు, లహరీ, సోనీ, మానస, యశస్వినీ, అభిగ్న, అనియా, రన్వితా, భవ్య, నిశ్చల, జాహ్నవీ, శృతి, తీర్థ, జస్మితా, జాహ్నవి, ప్రహసిని, సంహిత, నిత్య, నైనా, అధ్వితా, లక్కీ, ఆద్య, హర్షిత, హర్షిణీ, అనికా, విన్మై, అద్విత ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం కళాకారులకు సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్, సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు జ్ఞాపికల‌ను అందించారు. చివరిగా శ్రీ స్వరసిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ ప్రసాద వితరణ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here