శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలని ప్రతి ఒక్కరికి అవగాహన రావాలని వీలైనప్పుడల్లా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలని పిలుపునిస్తూ మెట్రో రైలులో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ ప్రయాణించారు. ప్రజలు ఇంధనాన్ని పొదుపు చేయాలని, బంగారం కొనుగోళ్లను ఏడాదిపాటు నిలిపివేయాలని, దీని వల్ల పెద్ద ఎత్తున విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని, రూపాయి విలువ బలోపేతమవుతుందని అన్నారు.






