శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): మన భవిష్యత్తు తరాలకు ఆస్తులు కాదు, మంచి ఆరోగ్యం, ప్రశాంత జీవితం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి ఇన్‌చార్జి, మాజీ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. గురువారం హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో రూ.26.20 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవిడుపు పరికరాలను వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ, జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో ఓపెన్ జిమ్ ప్రారంభం కావడం సంతోషకరమైన విషయమని అన్నారు. దీని వల్ల ఉదయం, సాయంత్రం వాకింగ్‌కు వచ్చే పిల్లలు, పెద్దలు, వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయడం జరిగిందని, అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మరిన్ని కాలనీల్లో ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఓపెన్ జిమ్‌ల ద్వారా ప్రజలకు ఆరోగ్యం లభిస్తుందని, ఈ దిశగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుత జీవన విధానంలో ప్రతి ఒక్కరూ విధిగా వ్యాయామం చేయడం ఎంతో అవసరమని అన్నారు. ఆరోగ్యం బాగుంటేనే మనం ఏదైనా సాధించేందుకు వీలు కలుగుతుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని స్పష్టం చేశారు. ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు శ్రద్ధ చూపించాలని పేర్కొన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ లోని పార్క్ లను అన్ని విధాలుగా సుందరీకరించి, అన్ని హంగులతో , అన్ని రకాల మౌలిక వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని, వాకింగ్ ట్రాక్ నిర్మాణం ద్వారా పిల్లలకు, పెద్దలకు వాకింగ్ చేసుకోవడానికి సులభంగా ఉండి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతగానో తోడ్పడుతుందని , మెష్ ఏర్పాటు చేయడం జరిగిందని, పార్క్ చుట్టూ చదును చేయడం జరిగిందని, పార్క్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి , అన్ని రకాల వసతులు కల్పిస్తామని, పార్క్ లలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రా రెడ్డి ఆల్విన్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ విఘ్నేశ్వర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ పెద్ది రెడ్డి, జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ కిషన్, ట్రెజరర్ సాంబశివ రెడ్డి, లీగల్ సెక్రెటరీ వేణు గోపాల్, కల్చరల్ సెక్రటరీ నర్సింహులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






