శేరిలింగంప‌ల్లి జోన్‌లో జనగణన కార్యకలాపాలపై సమీక్ష

శేరిలింగంప‌ల్లి, మే 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి జోనల్ కమిషనర్ నారాయణ్‌ అమిత్ గురువారం జోనల్ కార్యాల‌యంలో జనగణన కార్యకలాపాలపై అన్ని వార్డుల నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డుల వారీగా జనగణన ఎన్యుమరేషన్ పురోగతిని క్షుణ్ణంగా సమీక్షించారు. జనగణనలో క‌చ్చితమైన సమాచార సేకరణ, ప్రజల్లో సమర్థవంతమైన అవగాహన కల్పన, జోన్ వ్యాప్తంగా నిర్ణీత గడువులోగా జనగణన కార్యకలాపాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటి వివరాలను పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, ప్రజలకు జనగణన ఆవశ్యకతపై విస్తృత ప్రచారం చేపట్టాలని జోనల్ కమిషనర్ సూచించారు. వార్డు నోడల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, జనగణన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. జనగణన దేశాభివృద్ధికి, పథకాల రూపకల్పనకు కీలకమని, ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here