ఎమ్మెల్యే న‌వీన్ యాదవ్‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించాలి: బేరి రామచందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, నవంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్ర నాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వల్లాల నవీన్ యాదవ్ కి నిర్వ‌హించిన‌ ఆత్మీయ సన్మాన సభ కార్యక్రమంలో బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ యాదవులకు మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని అన్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కి మంత్రి పదవి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులు బీసీలు నిలబడి అత్యధిక స్థానాలు గెలుచుకొని బీసీల రాజ్యాధికారం అంతిమ లక్ష్యంగా ముందుకు నడవాలని అన్నారు. ముఖ్యంగా యువత రాజకీయాల్లోకి రావాలని తద్వారానే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ మెంబర్ మందాడి అనిల్ కుమార్ యాదవ్, చిన్న శ్రీశైలం యాదవ్, రాజయ్య యాదవ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మేకల రాములు యాదవ్, ఎంబి కృష్ణ యాదవ్, ఆర్ లక్ష్మణ్ యాదవ్, ఈశ్వరమ్మ, జగ్గు యాదవ్, యశ్వంత్ యాదవ్, భూమన్న యాదవ్, మహేందర్ యాదవ్, రాష్ట్ర బీసీ నాయకులు వినోద్ యాదవ్, అందెల కుమార్ యాదవ్, వికారాబాద్ జిల్లా బిసి అధ్యక్షుడు శంకర్ యాదవ్, వికారాబాద్ జిల్లా బిసి అధ్యక్షుడు యాదగిరి యాదవ్, శివకుమార్ యాదవ్, పాములేటి సుబ్బయ్య యాదవ్, మధు యాదవ్, వెంకట్ యాదవ్, కృష్ణ యాదవ్, శేరిలింగంపల్లి యాదవ సంఘం అధ్యక్షుడు కిట్టు యాదవ్, సిద్దిక్ నగర్ యాదవ్ సంఘం అధ్యక్షుడు అప్పల వినోద్ యాదవ్, మల్లెల ఐలేష్ యాదవ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here