శేరిలింగంపల్లి, నవంబర్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని గోల్డెన్ తులిప్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్జీ బాటిల్ డోర్ బ్యాడ్మింటన్ అకాడమీ శాఖను మాజీ ఇంటర్నేషనల్ బ్యాట్మింటన్ ప్లేయర్, తెలంగాణ రాష్ట్ర బ్యాట్మింటన్ అసోసియేషన్ సలహాదారు కొసరాజు లక్ష్మణ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అక్టోపస్ బేగంపేట్ కే. గంగారెడ్డి, గోల్డెన్ తులిప్ కాలనీ అధ్యక్షుడు విద్యా సాగర్ రెడ్డితో కలసి కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆర్జీ బాటిల్ డోర్ బ్యాట్మింటన్ అకాడమీ శాఖ యాజమాన్యం గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. మరిన్ని శాఖలుగా అభివృద్ధి చెందాలని ఆకాక్షించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్పీ కే. గంగారెడ్డి, టీఎస్ స్టేట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అడ్వైజర్ కే. లక్షణ్, గోల్డెన్ తులిప్ అధ్యక్షుడు విద్యా సాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు షేక్ చాంద్ పాషా, తిరుపతి పటేల్, వ్యాపారావేత్తలు వెంకట రాజు, నరేందర్, వెంకటేష్ పటేల్, కచ్చావా దీపక్, ఫణి, బళ్ళ జశ్విక్, మంగెన దేవాన్ష్ తదితరులు పాల్గొన్నారు.






