మియాపూర్ పోలీసుల ఆద్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం… దాత‌ల‌ను అభినందించిన ఇన్‌స్పెక్ట‌ర్ వెంక‌టేష్‌…

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విశ్వనాథ గార్డెన్స్‌లో ఇన్‌స్పెక్ట‌ర్‌ వెంకటేష్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల సహాయార్థం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పోలీసుల‌తో పాటు స్థానికులు క‌లిపి మొత్తం 62 మంది ర‌క్త‌దానం చేశారు. స్వ‌యంగా ర‌క్తదానం చేసి శిబిరాన్ని ప‌ర్య‌వేక్షించిన ఇన్‌స్పెక్ట‌ర్ వెంక‌టేష్ మాట్లాడుతూ సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాల ప్రకారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రక్తం కోసం తలసేమియా బాధితులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, వారికి తోచిన స‌హ‌కారం అందించేందుకు ఈ ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు తెలిపారు. శిబిరంలో ర‌క్త‌దానం చేసిన ఎస్ఐలు మొద‌లు మొత్తం సిబ్బందికి, ఇత‌ర దాత‌ల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. శిబిరం నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపిన ఎస్ఐ వీర‌బ్ర‌హ్మంను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు. ఈ రక్తదాన శిబిరంలో డీఐ మహేష్ గౌడ్, ఎస్ఐలు రవి కిరణ్, మౌనిక, స్టేష‌న్‌ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

స్వ‌యంగా ర‌క్త‌దానం చేస్తున్న మియాపూర్ ఇన్‌స్పెక్ట‌ర్ సామ‌ల వెంక‌టేష్‌, ఇత‌ర సిబ్బంది
Advertisement

1 COMMENT

  1. Very Good initiative by police particularly Ci garu…. Such programs will bring changes in the Behaviors of POLICE towards citizens and inherently enhances the Humanitarian Approach positively.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here