శాంతీన‌గ‌ర్‌లో జ‌ల‌మండ‌లి అధికారుల‌తో క‌లిసి యూజీడీ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హ‌ఫీజ్‌పేట్‌ డివిజన్ పరిధిలోని శాంతిన‌గ‌ర్‌లో జ‌ల‌మండ‌లి జీఎం రాజ‌శేఖ‌ర్‌, డీజీఎం నాగ‌ప్రియ‌ల‌తో క‌ల‌సి మాదాపూర్ కార్పొరేట‌ర్ వి.జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ ప‌ర్య‌టించారు. బ‌స్తీలో కొన‌సాగుతున్న భూగ‌ర్భ డ్రైనేజీ ప‌నుల‌ను వారు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌దీశ్వ‌ర్‌గౌడ్ మాట్లాడుతూ హ‌ఫీజ్‌పేట్‌, మాదాపూర్ డివిజ‌న్ల‌లోని ప్రతి కాలనీ, బస్తీలో ప్రజలకు మెరుగైన మౌళికవసతులు కల్పించడమే ప్రధాన ద్యేయంగా ముందుకు సాగుతున్నామని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అభివృద్ధి ప‌నుల విష‌యంలో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని, అదేవిధంగా త్వ‌రితగ‌తిన ప‌నులు పూర్తిచేసి ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు క‌లుగ‌కుండా చూడాల‌ని అధికారుల‌కు ఆయ‌న సూచించారు. ఈ కార్యక్రమంలో జ‌లమండ‌లి చందాన‌గ‌ర్ మేనేజ‌ర్ సుబ్ర‌హ్మ‌ణ్య‌రాజు, బస్తి అధ్యక్షులు సుధాకర్, నాయ‌కులు భిక్షపతి, మల్లేష్, లక్ష్మణ్ రావు, అంజయ్య, అఫ్సర్, అక్బర్, గౌస్, సల్మాన్, మౌలానా, కృష్ణ, అశోక్, అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.

శాంతీన‌గ‌ర్‌లో యూజీడీ ప‌నుల‌ను ప‌రిశీలించిన కార్పొరేట‌ర్ జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, జ‌ల‌మండ‌లి జీఎం రాజ‌శేఖ‌ర్‌, డీజీఎం నాగ‌ప్రియ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here