మెడిక‌వ‌ర్ హాస్పిట‌ల్‌లో కోవిడ్‌ వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మ‌హిపాల్ రెడ్డి

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: మెడికవర్ హాస్పిటల్స్ రామచంద్రపురం శాఖలో వాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. ప‌టాన్‌చెరు శాసనసభ సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌రై కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను సోమ‌వారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల వారు చేరుకోవడానికి అనుకూలంగా లింగంప‌ల్లి చౌర‌స్థాలో ఉన్నటువంటి మెడికవర్ హాస్పిటల్‌లో వాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించడం చాల సంతోషంగా ఉందని అన్నారు. వాక్సినేషన్ గురించి ఎలాంటి వదంతులని నమ్మవద్దని, ప్రతి ఒక్కరు వాక్సిన్ తీసుకోవాలని సూచించారు. హాస్పిట‌ల్ సెంటర్ హెడ్ శ్రీకాంత్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటినా ప్రతిఒక్కరు కోవిన్ వెబ్సైట్‌లో రిజిస్టర్ చేఉకోని టీకా కోసం తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. టీకా పూర్తిగా సురక్షితమైనద‌ని, వదంతులను నమ్మవద్దని అన్నారు. కరోనా నుంచి కోలుకున్నాక కూడా బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, యెల్లో ఫంగస్ లాంటి వ్యాదులు వ్యాప్తి చెందుతున్న నేప‌థ్యంలో ఆరోగ్యంపట్ల ప్ర‌త్యేక శ్రద్ధ వహించాల‌ని అన్నారు. కాగా మొదటి రోజు డ్రైవ్‌లో దాదాపు 400 మందికి మొదటి డోసు, 100 మందికి రెండవ డోసు ఇచ్చామ‌ని, వ్యాక్సిన్ తీసుకున్న వారిని 30 నిమిషాల పాటు వైద్యుల బృందం ప్ర‌త్యేకంగా ప‌ర్య‌వేక్షించింద‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిధులుగా మియాపూర్ ఏసిపి కృష్ణ ప్రసాద్, స్థానిక కార్పొరేటర్లు పుష్ప నగేష్ యాదవ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ సంజయ్, టీఆర్ఎస్ నాయ‌కులు ఆద‌ర్శ్‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నగూడెం మ‌హిపాల్‌రెడ్డి, కార్పొరేట‌ర్ పుష్ఫ‌నాగేష్ యాద‌వ్‌, ఆద‌ర్శ్ రెడ్డి త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here