నమస్తే శేరిలింగంపల్లి: ఎంసీపీఐ(యూ) జాతీయ ప్లీనరీ సమావేశాలు కేరళ రాష్ట్రం చెలకుడి మహ్మద్ గౌస్ నగర్ ల్యాబ్ సింగ్ భంగ్ హాల్ వ్యాపార భవనంలో గురువారం ఘనంగాప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఎంసీపీఐయూ ప్లీనరీ సమావేశాలను కామ్రేడ్స్ రాజాదాస్, మంగత్ రాం లాంగో వాల్, వి. ఉపేందర్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన అమరుల స్తూపం వద్ద పార్టీ సీనియర్ నాయకులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి అనుభవ దాస్ శాస్త్రీ జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు.పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కె సి శర్మ అమరవీరులకు, అమరజీవులకు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అనారోగ్యంతో మృతి చెందిన ఎంసీపీఐయూ జాతీయ కార్యదర్శి మహ్మద్ గౌస్, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ల్యాబ్ సింగ్ భంగ్, వివిధ రాష్ట్రాల రాష్ట్ర కమిటీ సభ్యులు నాను నాయక్, పడమటి చిన్న, మార్టిన్ రాజా, రాజలింగం, రైతు ఉద్యమ అమరవీరులకు వివిధ దేశాల్లో, భారతదేశంలోని ఫాసిస్టు, మతోన్మాదుల చేతిలో మరణించిన వారికి, హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వీర జవాన్లకు ప్లీనరీ సమావేశంలో మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రెడ్ మద్ది కాయల అశోక్ అంతర్జాతీయ, జాతీయ పరిణామాల పై నివేదికను ప్రవేశ పెట్టారు. ప్రపంచ పరిణామాలు లాటిన్ అమెరికా కేంద్రంగా సరళీకృత, నూతన ఆర్థిక పారిశ్రామిక , సంస్కరణల కు వ్యతిరేకంగా , ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ విధానాలతో పెరిగిన నిరుద్యోగం, పేదరికం, ఆకలి, దారిద్ర్యం, అసమానతల వల్ల ప్రజలు పోరాటాలు నిర్వహించి ప్రభుత్వాలను గద్దె దించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా చిలీలో లెప్ట్ ప్రభుత్వం వచ్చిందన్నారు. చిలీ దేశ ప్రజల స్పూర్తితో భారతదేశంలో సంవత్సరం పాటు రైతులు చేసిన విరోచిత పోరాటం ఫలితంగా దేశ ప్రధానమంత్రి క్షమాపణలు చెప్పి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసారని గుర్తుచేశారు. దేశంలో ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక ఉద్యమాలు, సామాజిక న్యాయం కోసం బహుజన శక్తుల లో వస్తున్న చైతన్యం ను స్పూర్తిగా తీసుకుని కమ్యూనిస్టు ఉద్యమ శక్తులు సామాజిక న్యాయం కోసం లాల్, నీల్ శక్తులు ఐక్య వేదిక మీద కి తీసుకు రావాలని ఆ దిశగా దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టు, సామాజిక శక్తుల ఐక్యత కోసం ఎంసీపీఐయూ కృషి చేస్తుందన్నారు. ఈ ప్లీనరీ సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ, పోలిట్ బ్యూరో సభ్యులు మహేందర్ నేహా, శ్రీ కుమార్, కాటం నాగభూషణం, జార్జ్, గాదగోని రవి, కృష్ణమాల్, మోహన్ లాల్, భూపతి నారాయణ్ సింగ్, క్రాంతి నారాయణ్ సింగ్, కె సుకన్య, సులీఫ్, అమల్ దాస్, వనం సుధాకర్, కేబి శర్మ,12 రాష్ట్రాల ప్రతినిధులు 205 మంది పాల్గొన్నారు.