నమస్తే శేరిలింగంపల్లి: ప్రజలంతా విధిగా లాక్‌డౌన్ నిబంధనలు పాటించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. నాల్గవ రోజు లాక్‌డౌన్ పరిస్థితులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్‌లలో పర్యటించి లాక్‌డౌన్ స్థితిగతులపై ఆరాతీశారు. కోవిడ్ రెండవ దశ తీవ్రత అధికంగా ఉందని, ప్రజల భాద్యతా రాహిత్యంగా ప్రవర్తించి ప్రాణాలపై తీసుకోచ్చుకోవద్దని సూచించారు. అత్యంత అవసరం ఐతే కనుక బయటకు రావద్దని సూచించారు. సైబరాబాద్ పరిధిలో దాదాపు 5 వేల మంది పోలీసులు లాక్‌డౌన్‌లో సేవలందిస్తున్నారని, ప్రజలు పరిస్థితులను అర్థం చేసుకోవాలని సూచించారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆద్వర్యంలో ఐసోలేషన్ సెంటర్‌ను సైతం ఏర్పాటు చేసి కోవిడ్ పేషెంట్లకు తమ వంతు సహకారం అందిస్తున్నామని అన్నారు. విధినిర్వహిణలో ఉన్న పోలీసులు లాక్‌డౌన్ విషయంలో రాజీ పడాల్సిన పనిలేదని, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ విజయ్‌కుమార్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్ ఏడీసీపీ మనిక్‌రాజ్, మాదాపూర్ ఏసీపీ పురుషోత్తం, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్ రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
